

2026 ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నగోయాకు చేరుకున్న భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు వసతి విషయంలో అనూహ్య సమస్య ఎదురైంది. భారత బృందంలోని సభ్యుల కోసం ఉపయోగిస్తున్న క్రూయిజ్ షిప్‌లో ప్రణతి, అశోక్ మిశ్రాకు తొలుత ఒకే గది కేటాయించారు. ఈ ఏర్పాటుపై ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేసి, వెంటనే భారత బృందం అధికారులు, నిర్వాహకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
కొన్ని గంటలపాటు సమస్య పరిష్కారం కాకపోవడంతో భారత ఒలింపిక్ సంఘం జోక్యం చేసుకుని తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఇద్దరికీ వేర్వేరు వసతి ఏర్పాట్లు చేసింది. అయితే అశోక్ మిశ్రాకు మరో ఇబ్బంది ఎదురైంది. కొత్త గదికి తాళాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు రికార్డుల్లో ఆయన బుకింగ్ కనిపించలేదు. అధికారిక రికార్డుల్లో పేరుకు సంబంధించిన పొరపాటు కారణంగా అక్రిడిటేషన్, బుకింగ్ వివరాలను మళ్లీ ధృవీకరించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు మరో 45 నిమిషాలు పట్టడంతో ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాతే గదిలోకి వెళ్లగలిగారు. ఈ ఘటనను ప్రణతి నాయక్ కూడా ధృవీకరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!