

52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్–2026లో వాటర్ పోలో విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే జట్టును ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఐడీఏ స్విమ్మింగ్ పూల్, పిప్లియాహానా స్క్వేర్ వేదికగా సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు పోటీలు జరగనున్నాయి. తెలంగాణ జట్టులో మొత్తం 15 మంది క్రీడాకారులు చోటు దక్కించుకోగా, లింగమనేని అనిరుధ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణ జట్టులో లింగమనేని అనిరుధ్‌తో పాటు అరవింద్ రేషమ్, బి. అక్షజ్, బండ్ల అద్వైత్, కటుకోజ్వాల భువన్, మద్ది మోహన్ దుర్గ, మధునాల అభినవ్, ఎండీ అజాన్, మహ్మద్ అబ్దుర్ రహ్మాన్ సిద్ధిఖీ, సోమాన్షు బాస, ప్రదివ్ కడాలి, శ్రేయస్ మాధవరమ్, శ్రేయస్ రెడ్డి గాలి, శ్రీ అఖిల్ చారి విష్ణురోజు, స్వరన్ కంకణాల ఉన్నారు. జాతీయ వేదికపై ప్రతిభ చాటేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!