2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

Writer: Nithish 05:04 PM, 2 సెప్టెంబర్, 2026
నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో త్రిశూలీ నదికి వచ్చిన భారీ వరదల్లో ఓ ఆకుపచ్చ రంగు ఇల్లు చెక్కుచెదరకుండా నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రకాష్‌కు చెందిన ఈ ఇంటి చుట్టూ ఉన్న భవనాలు, వాహనాలు, ఇతర వస్తువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. ఈ ఇల్లు మాత్రం సురక్షితంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. వరద నీరు వేగంగా పెరుగుతున్న విషయం తెలియగానే దుకాణం నుంచి ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చానని ప్రకాష్ తెలిపారు. అప్పటికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నారని, వారందరినీ బయటకు రావాలని పిలిచినా.. నీటి ఉధృతికి తమ వాహనం పల్టీ కొట్టడం చూసి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయామని చెప్పారు. ప్రాణాలు దక్కుతాయో లేదోనని భయపడ్డామని తెలిపారు. నీటి మట్టం పెరగడంతో కుటుంబ సభ్యులంతా తొలుత నాలుగో అంతస్తుకు, ఆ తర్వాత భవనం పైకప్పుపైకి చేరుకున్నారు. అదే సమయంలో పాఠశాలకు వెళ్లిన తన కుమారుడి పరిస్థితిపై తీవ్ర ఆందోళనకు గురైనట్లు ప్రకాష్ చెప్పారు.

ఈ ఇల్లు వరదను తట్టుకుని నిలబడటానికి దాని నిర్మాణ నాణ్యతే ప్రధాన కారణమని ప్రకాష్ వివరించారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనానికి అప్పట్లో నాణ్యమైన సిమెంట్, నిర్మాణ సామగ్రిని ఉపయోగించామని, నదికి సమీపంలో ఉండటంతో పునాది బలంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పునాది కింద రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ను రెండు, మూడు పొరలుగా వేసినట్లు చెప్పారు. అయితే ఇంటి కింది భాగాన్ని దుకాణానికి సంబంధించిన గోదాముగా ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్న సరుకులతో పాటు రెండు కార్లు, బైకులు, స్కూటర్లు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంట నుంచి గంటన్నర పాటు ప్రాణభయంతో ఇంట్లో చిక్కుకున్న తర్వాత నీటి మట్టం కాస్త తగ్గింది. అనంతరం సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన స్థానికులు భవనాల మధ్య పైపును ఏర్పాటు చేసి, తాడు సాయంతో ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

ట్యాగ్లు
నేపాల్ వరదలునువాకోట్త్రిశూలీ నదినేపాల్ వరద బీభత్సంప్రకాష్ ఇల్లువరదల్లో సురక్షితమైన ఇల్లుభారీ వరదలుప్రకృతి విపత్తునేపాల్ వార్తలువరద రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!
జనరల్

నేపాల్ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు.. అసలు కారణం ఇదే!

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం
జనరల్

అయోధ్య రామ మందిరానికి కొత్త సీఈఓ నియామకం

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ
రాజకీయాలు

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!