
జనరల్

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌కు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో కెనడాకు చెందిన విక్టర్ లాయ్ చేతిలో లక్ష్య సేన్ వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. 14-21, 7-21 స్కోరుతో లాయ్ విజయం సాధించడంతో లక్ష్య సేన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఈ ఓటమితో 2026లో విక్టర్ లాయ్‌పై లక్ష్య సేన్ హెడ్ టు హెడ్ రికార్డు 1-3కు పడిపోయింది. ఈ ఏడాది లక్ష్య సేన్‌పై లాయ్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. దీంతో చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్ పోరాటం తొలి దశలోనే ముగిసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!