
క్రీడలు

టోల్‌ప్లాజాల వద్ద జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనధికారిక సాఫ్ట్‌వేర్ యాప్‌లను ఉపయోగించి టోల్ వసూళ్లలోని కోట్లాది రూపాయల ఆదాయాన్ని దారి మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక అంశాలు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
టోల్ వసూళ్ల వ్యవస్థలో జరిగినట్లు భావిస్తున్న ఈ అక్రమాలపై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో లభించిన డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమ సాఫ్ట్‌వేర్ వినియోగం ద్వారా ఆదాయాన్ని ఎలా దారి మళ్లించారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!