
సినిమాలు

శనివారం విశాఖలో జరగనున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నవంబర్ 28 వరకు జరిగిన తొలివిడత టికెట్ల విక్రయాల్లో అనుకున్నంత స్పందన లేదు. కానీ నవంబర్ 30 న రాంచీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేయడంతో టికెట్లకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. రాయ్‌పూర్‌లో రెండో వన్డేలోనూ 102 పరుగులు చేయడంతో విశాఖ మ్యాచ్‌కు మరింత క్రేజ్ పెరిగింది. కోహ్లీకి విశాఖలోనూ మంచి రికార్డులే ఉన్నాయి. ఇక్కడ ఏడు మ్యాచ్‌లు ఆడి 587 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!