

ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు యాజమాన్యం వహిస్తున్న సన్ గ్రూప్, ఇంగ్లాండ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ది హండ్రెడ్ టోర్నమెంట్లో లీడ్స్ ఆధారిత ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఉన్న ఈ జట్టును ఇకపై సన్‌రైజర్స్ లీడ్స్‌గా రీబ్రాండ్ చేశారు. ఈ డీల్ విలువ సుమారు 100 మిలియన్ యూరోలుగా అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) మరియు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ సంయుక్త యాజమాన్యంలో ఉన్న ఈ జట్టు, ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలోకి వెళ్లిన తొలి ది హండ్రెడ్ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది.
ఈ మార్పుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ స్పందిస్తూ, “సన్‌రైజర్స్ అనేది కేవలం ఒక జట్టు కాదు, ఒక కుటుంబం, భావోద్వేగం మరియు అభిరుచి. హెడింగ్లీ స్టేడియాన్ని ఆరెంజ్ రంగుతో నింపేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌లతో పాటు ఇప్పుడు సన్‌రైజర్స్ లీడ్స్ కూడా సన్ గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌లో భాగమైంది. ఈ మార్పులు 2026 సీజన్ నుంచి అమల్లోకి వస్తాయి. అదే సీజన్ నుంచి ది హండ్రెడ్‌లో డ్రాఫ్ట్ విధానానికి బదులుగా వేలం పద్ధతి అమలు చేయనుండగా, ఆటగాళ్ల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!