
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 52 డివిజన్లు, 246 మండలాల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ విడతలో 3,803 సర్పంచ్ స్థానాలు, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాల కోసం 63,395 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు, 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో పోలింగ్ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!