29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

Writer: Nithish 08:17 AM, 29 నవంబర్, 2026
అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

రాజధాని అమరావతిలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణ వ్యయంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.29,340 ఖర్చవుతోందంటూ జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. వాస్తవానికి ఈ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,339 మాత్రమేనని స్పష్టం చేసింది. మొత్తం 71.43 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణాన్ని జగన్‌ 52.20 లక్షల చదరపు అడుగులుగా చూపిస్తూ, చదరపు అడుగుకు అయ్యే ఖర్చును పెంచి చెబుతున్నారని ప్రభుత్వం తన ఫ్యాక్ట్‌చెక్‌లో పేర్కొంది. పార్లమెంటు భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని కూడా వెల్లడించింది.

రుషికొండ ప్యాలెస్‌ సందర్శనకు ప్రజలను అనుమతించాలన్న కేబినెట్‌ నిర్ణయం నేపథ్యంలోనే జగన్‌ అమరావతిపై తప్పుడు ప్రచారానికి తెరతీశారని ప్రభుత్వం ఆరోపించింది. రుషికొండలో నిర్మించిన భవనానికి చదరపు అడుగుకు రూ.30 వేలకుపైగా ఖర్చు చేశారని, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌జీటీ ఆదేశాల మేరకు రూ.200 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, అమరావతి సచివాలయ భవనాల నిర్మాణ అంచనాలు భారీగా పెరిగాయని జగన్‌ ఆరోపించారు. 2018లో రూ.2,271 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.15,317 కోట్లకు చేరిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మెట్రో నగరాల్లో ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో నిర్మించే భవనాలకూ చదరపు అడుగుకు రూ.5 వేలకు మించి ఖర్చు కాదని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

ట్యాగ్లు
అమరావతిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవైఎస్ జగన్చంద్రబాబు నాయుడుసచివాలయం నిర్మాణంఅమరావతి రాజధానినిర్మాణ వ్యయంరుషికొండ ప్యాలెస్ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్వైకాపా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌
క్రీడలు

సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌
జనరల్

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు
జనరల్

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్
టెక్నాలజీ

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాజకీయాలు

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే
జనరల్

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ
జనరల్

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ
జనరల్

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ
జనరల్

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌
బిజినెస్

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
బిజినెస్

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!