

భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జూలై 19న జరిగే మూడో వన్డే ఆయన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత సెలక్షన్ కమిటీ భవిష్యత్ జట్టును సిద్ధం చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను దీర్ఘకాలిక ఓపెనర్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో భవిష్యత్ ప్రణాళికల్లో కీలకంగా పరిగణిస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలి వన్డే ప్రదర్శనలపై కూడా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం పూర్తిగా రోహిత్ శర్మదేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీ మాత్రం భారత జట్టు ప్రపంచకప్ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!