
గాసిప్స్

మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మరోసారి హైదరాబాద్ ఆటగాళ్లను పక్కన పెట్టింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జట్టే అయినప్పటికీ, హైదరాబాద్ కు చెందిన ఒక్క ఆటగాడినీ కూడా ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది.
దీనికి బదులుగా సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు మంది అన్క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లను ఎంపిక చేయడం గమనార్హం. ఇటీవల దేశీయ టోర్నీల్లో ప్రతిభ చూపిన హైదరాబాద్ ఆటగాళ్లను విస్మరించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనయ్ త్యాగరాజన్, రక్షిత్ రెడ్డి, ఆరోన్ జైరాజ్, రాహుల్ బుద్ధి, మనీష్ రెడ్డి, నిశాంత్ శరణు, అలాఫ్, నితిన్ సాయి వంటి హైదరాబాద్ ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నప్పటికీ, సన్రైజర్స్ హైదరాబాద్ వారిలో ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. దీనితో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!