

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు, అది కోట్లాది అభిమానుల భావోద్వేగం. టోర్నమెంట్ ఏదైనా ఈ రెండు జట్ల పోరుపైనే అందరి దృష్టి ఉంటుంది. మ్యాచ్ జరుగుతుంటే ఇరుదేశాల అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ప్రపంచ కప్ వేదికపై ఈ సమరం మరింత ఉత్కంఠను కలిగిస్తుంది.
ఈసారి కూడా అభిమానులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించేలా భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్న ఈ రెండు జట్లు ఈనెల 15 న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గ్రూప్ దశ మ్యాచ్‌లో తలపడతాయి. బ్యాట్, బంతితో ఇరుజట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నారు.
టీ20 ఫార్మాట్లో, ముఖ్యంగా ప్రపంచ కప్‌లలో చూస్తే పాకిస్థాన్‌పై భారత్‌కే స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో ఎనిమిది మ్యాచ్‌లు జరగగా, వాటిలో ఏడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 2007 ప్రపంచ కప్‌లో మొదలైన విజయ పరంపర 2016 వరకు కొనసాగింది. 2021లో ఒక్కసారి ఓటమి ఎదురైనా, ఆ తర్వాత జరిగిన రెండు టోర్నీల్లో మళ్లీ భారత్‌కే విజయం దక్కింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!