
జనరల్

తెలంగాణ వేదికగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారు. ఐదు విభాగాల్లో పోటీలు జరగ్గా, భారత్ మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో తుషార్ సువీర్ విజేతగా నిలవగా, మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్ రాజ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
పురుషుల డబుల్స్ విభాగంలో కృష్ణ ప్రసాద్, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ విజేతగా నిలిచి భారత్‌కు మరో టైటిల్ అందించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సతీష్ కుమార్ జోడీ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయాలతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై భారత ఆటగాళ్లు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!