

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జడ్పీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యం సాధించింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ 406 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ 20 స్థానాలను దక్కించుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ఆరు స్థానాల్లో, సీపీఐ(ఎం) ఒక స్థానంలో గెలుపొందారు.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 7,768 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, టీడీపీ 4,806 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 1,711, జనసేన 938, భాజపా 117 స్థానాలను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 169 స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ(ఎం) 15, కాంగ్రెస్ తొమ్మిది, బీఎస్పీ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ ఫలితాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మధ్య ఉన్న బలాబలాలు స్పష్టమయ్యాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!