

ఐపీఎల్ మినీ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 17లోగా ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటారు? ఎవరిని విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ట్రేడింగ్ ద్వారా ఆటగాళ్ల మార్పిడి కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ కొన్ని మార్పులు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ ట్రేడ్‌పై కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా పలు జట్ల రిటెన్షన్ వ్యూహాలపై తన అంచనాలను వెల్లడించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేసి, తిరిగి వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉందని పుజారా అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లను వదిలేయొచ్చని అంచనా వేశాడు. గుజరాత్ టైటాన్స్ తెవాతియా, షారుక్ ఖాన్‌ల విషయంలో పునరాలోచించవచ్చని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్, హర్షల్ పటేల్‌లను విడుదల చేయవచ్చని, పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్‌లను వదులుకోవచ్చని చెప్పాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీలను, ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లను విడుదల చేసే అవకాశం ఉందని పుజారా అంచనా వేశాడు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్లను పెద్దగా మార్చకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!