

మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన జన్మదినం సందర్భంగా కలిశారు. ఢిల్లీలోని ఆడ్వాణీ నివాసానికి వెళ్లిన మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. 1927 నవంబర్ 8న జన్మించిన ఆడ్వాణీ 99 ఏళ్లు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి.
ఢిల్లీలో జరిగిన వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా నిలవాలని ఆడ్వాణీ సూచించేవారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆడ్వాణీ చెప్పేవారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడ్వాణీ చేసిన ప్రముఖ ప్రసంగాలతో రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!