
జనరల్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలతో అమెరికా చరిత్రలోనే భారీ వెనుకడుగు వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తన పాలనలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ సైతం ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఒక్క రోజులోనే మూడు ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా తిరిగి పుంజుకుంటుందని, గతంలో కన్నా మరింత గొప్పగా, బలంగా ఎదుగుతుందని చెప్పారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రిపబ్లికన్లకు ఎదురైన ఎదురుదెబ్బపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!