

ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్ల మార్పిడి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరనున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో చేరవచ్చంటూ గతంలో ప్రచారం జరిగినప్పటికీ, చివరకు పంజాబ్ కింగ్స్‌తో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడింగ్‌ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించినట్లు కథనం పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారిక ఆమోదం రావాల్సి ఉంది.
ఈ స్వాప్ ఒప్పందంలో భాగంగా పంజాబ్ కింగ్స్ కీలక పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌లో చేరనున్నాడు. హార్దిక్ పాండ్యా పంజాబ్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అతని రాకతో పంజాబ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు అదనపు బలం చేకూరనుంది. మరోవైపు అర్ష్‌దీప్ చేరికతో ముంబై పేస్ బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ మార్పిడి ఇరు జట్ల కూర్పులో కీలక మార్పులకు దారితీయవచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!