
జనరల్

హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321గా నమోదైంది. అమెరికా ప్రమాణాల ప్రకారం ఇది ‘హజార్డస్’ (ప్రమాదకర) కేటగిరీ పరిధిలోకి వస్తుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో నమోదైన వివరాల ప్రకారం, నగరంలో PM2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 223 మైక్రోగ్రాములుగా, PM10 స్థాయి 264 మైక్రోగ్రాములుగా ఉంది.

వాతావరణం స్పష్టంగా ఉన్నప్పటికీ గాలిలో కాలుష్య కణాల తీవ్రత అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే మాస్క్ ధరించడం, కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయట వ్యాయామాలకు దూరంగా ఉండటం మంచిది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!