
టెక్నాలజీ

దోహాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత షూటర్ సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్ అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఆమె 41 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచింది. మరో భారత షూటర్ ఇషా సింగ్ 15 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
అదే వరల్డ్‌కప్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 413.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి అరుదైన ఘనత నమోదు చేశాడు. అర్హత దశలో కూడా 595 పాయింట్లు సాధించి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు.
ఇక పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అనీష్ 16 పాయింట్లతో రజతం గెలుచుకున్నాడు. మరో భారత ఆటగాడు విజయ్‌వీర్ సిద్ధు కాస్త తేడాతో కాంస్యాన్ని కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.




.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!