

వైజాగ్ వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 34 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. జెమీమా రోడ్రిగ్స్ 26 పరుగులు, స్మృతి మంధానా 14 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 10 పరుగులు చేసి జట్టుకు మద్దతిచ్చారు.
ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు జరిగిన తొలి టీ20లోనూ టీమ్ ఇండియా 122 పరుగుల లక్ష్యాన్ని 14.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. రెండో టీ20 లో మరింత వేగంగా లక్ష్యాన్ని చేరుకుని జట్టు ఫామ్‌లో ఉందని నిరూపించింది.
ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలోనూ అద్భుతమైన చేజింగ్‌తో ప్రత్యర్థిని మట్టికరిపించిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం, డిసెంబర్ 26న సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






.png&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!