

భారత్–న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు తుది పోరు జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ టీ20కు రంగం సిద్ధమైంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉండగా, హార్దిక్ పాండ్యా, హర్షిత్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా సంజూ శాంసన్ తన హోమ్ గ్రౌండ్లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో ఇరు జట్లు గెలుపుతో ముగించాలని భావిస్తున్నాయి. యువ ఆటగాళ్ల ఫామ్, ప్రయోగాత్మక మార్పులు ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. అభిమానులు ఉత్కంఠభరిత పోరును ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా, హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!