
రాజకీయాలు

ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బాలుర క్లాసికల్ విభాగంలో మయాంక్ చక్రవర్తి చివరి రౌండ్‌ను డ్రాగా ముగించి మొత్తం 7.5 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన ఆర్టిం పిన్‌జిన్ రజత పతకం సాధించగా, భారత ఆటగాడు దక్ష్ గోయెల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి బోర్డోలోయ్ కూడా చివరి రౌండ్‌ను డ్రా చేసుకుని 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన మరియా ఖోల్యావ్‌కో రజతంతో సరిపెట్టుకోగా, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్య పతకం సాధించింది. తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్ తమ తమ విభాగాల్లో ఆరో స్థానంతో పోటీని ముగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!