
సినిమాలు

ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటుకు సంబంధించి నోటీసు జారీ అయినట్లు సమాచారం. ఓటుకు సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలపై అధికారులు వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మహేష్ కుమార్ గౌడ్‌కు ‘ఎస్‌ఐఆర్’ నోటీసులు అందినట్లు సమాచారం.
ఈ నెల 8న నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఆయన తన ఇంటిపేరును నమోదు చేయగా, 2002 ఓటరు జాబితాలో అది లేకపోవడం వల్ల నోటీసు జారీ చేసినట్లు సమాచారం. తన ఓటుకు సంబంధించిన ప్రక్రియపై ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్, ఇప్పటికే అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!