
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌లో తొలి క్లాసిక్ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. ఇటాలియన్ ఓపెనింగ్‌తో ఆటను ప్రారంభించిన కరువానా 48 ఎత్తుల్లోనే ప్రజ్ఞానందను ఓడించి ఆరు పాయింట్లు సాధించాడు.
మరోవైపు మూడో స్థానం కోసం జరుగుతున్న పోరులో సో వెస్లీ, విన్సెంట్ కీమర్ మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ఫైనల్‌లో తొలి క్లాసిక్ గేమ్ ఫలితాల్లో కరువానా ఆధిక్యం సాధించగా, ప్రజ్ఞానంద తదుపరి గేమ్‌లలో పుంజుకోవాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!