
సినిమాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఆకట్టుకున్న నక్షత్రకు ‘ఇరుముడి’ సినిమాతో తొలి తెలుగు చిత్రంలోనే కీలక అవకాశం దక్కింది. ఆమె సోషల్ మీడియా వీడియోలు చూసిన దర్శకుడు, నక్షత్ర తల్లిని సంప్రదించినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆడిషన్‌లో పాల్గొన్న నక్షత్ర, ‘మనమ్మ’ పాత్రకు ఎంపికైనట్లు నక్షత్రతో పాటు చిత్ర దర్శకుడు కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ఇరుముడి’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన నక్షత్రకు సుమారు రూ.10 లక్షల పారితోషికం అందినట్లు సమాచారం. తొలి తెలుగు సినిమాకే ప్రాధాన్యమైన పాత్ర దక్కడంతో పాత్రకు తగిన విధంగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రావడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!