

భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఊరట కలిగించే వార్త ఒకటి వినిపిస్తోంది. భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌తో మళ్లీ జట్టులోకి రానున్నట్లు సమాచారం. చేతికి గాయం కారణంగా రెండో టీ20 కు దూరమైన అక్షర్, ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం 7 గంటలకు గువాహటి వేదికగా మూడో టీ20 ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు టీ20 ల్లో వరుస విజయాలు సాధించిన భారత్, ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటివరకు విజయం సాధించలేకపోయిన న్యూజిలాండ్ జట్టు, ఈ మ్యాచ్‌లో అయినా ఖాతా తెరవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి మ్యాచ్‌లో అర్షదీప్ ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయకపోవడంతో, అతని స్థానంలో అనుభవజ్ఞుడైన బుమ్రాను జట్టులోకి తీసుకునే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వస్తే, స్పిన్ విభాగంలో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!