
క్రీడలు

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 195/4 పరుగులు చేయగా, భారత్ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 199/5 స్కోర్‌తో ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో భారత జట్టు సమయోచితంగా ఆడి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తనవైపు తిప్పాడు. కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విజయంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది.



.jpg&w=3840&q=75)









.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!