
జనరల్

ఆసియా క్రీడలకు ముందు భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించిన భారత్ రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. నవ్‌నీత్ కౌర్, సునేలిటా టొప్పో చెరో గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
15వ నిమిషంలో సునేలిటా టొప్పో గోల్ చేయడంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఫైనల్లో అద్భుతంగా రాణించిన లల్రేమ్సియామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, టోర్నీ మొత్తం ఆరు గోల్స్ చేసిన దీపిక అమెరికా ఆటగాడు అష్లే సెస్సాతో కలిసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పంచుకుంది. జట్టు విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయం మరింత మంది యువత హాకీ వైపు ఆకర్షితులవుతారని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!