
జనరల్

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రానికి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే హిందీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ మూవీలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. ఆధ్యాత్మిక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!