

‘లాాలో’, ‘హనుమాన్ అంశ్’ చిత్రాల అద్భుతమైన బాక్సాఫీస్ విజయాలు సంప్రదాయ ట్రేడ్ విశ్లేషకులకు ఊహించని రియాలిటీ చెక్ ఇచ్చాయి. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లాాలో’.. మౌత్ టాక్ బలంతో ఏకంగా రూ.125 కోట్ల వసూళ్లను సాధించినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు కేవలం రూ.2 కోట్ల పెట్టుబడితో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ రూ.173 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. పరిమిత బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రాలు సాధించిన ఫలితాలు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా మారాయి.
ఈ విజయాలు భారీ ప్రచార కార్యక్రమాలు, అగ్ర హీరోల పేర్ల కంటే ప్రేక్షకులను నిజాయితీతో కూడిన కథలు, భావోద్వేగాలకు దగ్గరయ్యే కథనం ఎక్కువగా ఆకట్టుకుంటాయని మరోసారి నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులకు కథ నచ్చితే.. సినిమాను తమ మాటల ద్వారా మరింత మందికి చేరువ చేయగలరని ఈ చిత్రాల ఫలితాలు సూచిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణే అతిపెద్ద శక్తిగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రేక్షకులే అసలైన సూపర్‌స్టార్ అనే మాటకు ఈ రెండు సినిమాల విజయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!