

అమెరికాలో 9/11 ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. నాటి దాడుల తర్వాత బాధితుల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అమాయకులను ఉగ్రవాదం బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ కట్టుబడి ఉందని, సీమాంతర ఉగ్రవాదానికి భారత్ కూడా బాధిత దేశమని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని తెలిపారు.
ఉగ్రవాదం కాలానుగుణంగా కొత్త రూపాలను సంతరించుకుంటున్నప్పటికీ, భారత్ చెదరని పట్టుదలతో ఈ పోరును కొనసాగిస్తోందని మోదీ అన్నారు. ఉగ్రవాదం అనే పీడను నిర్మూలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2014లో 9/11 స్మారకాన్ని సందర్శించిన సందర్భంగా తీసిన ఫొటోలను కూడా ఎక్స్‌లో పంచుకున్నారు. 2001 ఈ నెల 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై దాడి చేసి, రెండు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేశారు. పెంటగాన్‌పై కూడా దాడి చేశారు. ఈ దాడుల్లో 2,977 మంది మరణించారు. ఈ విషాదానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!