

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) నుంచి వైదొలగాలని నాటో మిత్రదేశాలను అమెరికా కోరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ స్టాట్యూట్ నుంచి తప్పుకోవడంతో పాటు.. కోర్టుకు మద్దతును నిలిపివేయాలని అమెరికా సూచించినట్లు మూడు నాటో దౌత్య వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. జులై మధ్యలో బ్రస్సెల్స్‌లో నాటోకు చెందిన 32 మంది రాయబారుల రహస్య సమావేశంలో అమెరికా నాటో రాయబారి మాథ్యూ విటేకర్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఐసీసీ సామర్థ్యాలను ‘క్రమపద్ధతిలో రద్దు’ చేయాలని అమెరికా భావిస్తున్నట్లు పేర్కొన్న ఓ దౌత్య పత్రం కూడా నాటో దేశాలకు పంపినట్లు నివేదికలు తెలిపాయి.
ఐసీసీపై అమెరికా ఒత్తిడి ఇటీవల మరింత పెరిగింది. కోర్టు అమెరికా సార్వభౌమాధికారానికి ముప్పుగా మారుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ఆరోపించారు. ఆగస్టులో ఐసీసీ అధ్యక్షురాలు తోమోకో అకానే, సీనియర్ ట్రయల్ లాయర్ అబ్దులాయే సేయేపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సహా కొన్ని యూరప్ దేశాలు అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. 2002లో రోమ్ స్టాట్యూట్ ఆధారంగా ఐసీసీ ఏర్పాటైంది. జాతి నిర్మూలన, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ జరపడం దాని ప్రధాన ఉద్దేశం. అమెరికా, తుర్కియే ఐసీసీ సభ్య దేశాలు కావు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!