

బ్యాటింగ్‌లో ఆధిపత్యం, బౌలింగ్‌లో క్రమశిక్షణ ఈ రెండింటితో వరుసగా రెండు టీ20 లో భారత మహిళల జట్టు ఘన విజయాలు సాధించింది. ప్రత్యర్థి శ్రీలంక మహిళల జట్టు నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల జట్టు 2–0 ఆధిక్యంలో నిలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, మూడో మ్యాచ్‌లోనే సిరీస్‌ను ఖాయం చేయాలన్న పట్టుదలతో జట్టు సిద్ధమైంది.
విశాఖపట్నంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన హర్మన్‌సేన, శుక్రవారం తిరువనంతపురంలో జరిగే మూడో టీ20 లో లంకను ఎదుర్కొనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత జట్టును నిలువరించడం లంకకు పెద్ద సవాలే. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ తో పాటు పేసర్ క్రాంతి గౌడ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లంక బ్యాటర్లను క్రీజులో నిలబడనీయలేదు. ఫలితంగా తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 128 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేశారు.
మూడో మ్యాచ్‌లోనూ ఇదే స్థాయి ప్రదర్శనను టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే తిరువనంతపురం పిచ్ పై ఈ జోరు కొనసాగుతుందా అన్నది ఆసక్తికరం. జ్వరం కారణంగా రెండో మ్యాచ్‌కు దూరమైన దీప్తి శర్మ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం బౌలింగ్ ను మరింత బలోపేతం చేయనుంది.
బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన నుంచి పెద్ద ఇన్నింగ్స్ పై ఆశలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆమె 25, 14 పరుగులకే వెనుదిరిగింది. మరోవైపు జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ అర్ధసెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. టాప్ ఆర్డర్ విజయాలు అందిస్తుండటంతో మిగతా బ్యాటర్లకు ఆడే అవకాశం పెద్దగా రాలేదు.
సిరీస్‌లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్న ఆశతో లంక బరిలోకి దిగుతోంది. 2024 లో చివరిసారిగా భారత్ పై గెలిచిన శ్రీలంక, ఇప్పటివరకు భారత్‌తో ఆడిన 11 టీ20 లో 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!