
గాసిప్స్

భారత్లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని ఐసిసి స్పష్టం చేసింది. ఐసిసి నిర్వహించిన భద్రతా అంచనా నివేదిక ప్రకారం, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు భద్రతపై వ్యక్తమైన ఆందోళనలకు ముగింపు పలికినట్లైంది.

అదే సమయంలో, ఈ నెల 15 నుంచి వచ్చే నెల 6 వరకు జింబాబ్వే, నమీబియాలో జరగనున్న ఐసిసి మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ 2026 గ్రూపులను ఐసిసి ప్రకటించింది. గ్రూప్-బీలో భారత్తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా చోటు దక్కించుకోగా, గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉన్నాయి. ఇంగ్లాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే గ్రూప్-సీలో ఉండగా, అఫ్ఘానిస్తాన్, దక్షిణాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ గ్రూప్-డీలో పోటీపడనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!