

బంగ్లాదేశ్ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక మద్దతు ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తొలుత నిర్ణయించిన పాకిస్థాన్, సోమవారం జరిగిన ఐసీసీ సమావేశంలో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఇదే సమావేశంలో బంగ్లాదేశ్‌కు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనకపోవడంపై ఐసీసీ నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడా లేదా పరిపాలనా జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు బంగ్లాదేశ్ బోర్డుకు ఉంటుందని ఐసీసీ తెలిపింది. దీని వల్ల బంగ్లాదేశ్ హక్కులకు ఎలాంటి భంగం కలగదని పేర్కొంది. అదేవిధంగా, 2031 పురుషుల ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ ఒక ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని, అండర్ - 19 ప్రపంచకప్ నిర్వహణకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఐసీసీ నిర్ణయాలతో టీ20 వరల్డ్ కప్ 2026 లో పాల్గొనని బంగ్లాదేశ్‌కు పెద్ద ఊరట లభించిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!