

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉమెన్ జట్టు సంచలన విజయం సాధించి రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నెల 5, 2026 న వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 203/4 పరుగులు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 204/4 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ స్మృతి మంధాన 41 బంతుల్లో 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించింది. జార్జియా వోల్‌తో కలిసి రెండో వికెట్‌కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి డబ్ల్యూపీఎల్ చరిత్రలో నిలిచింది. చివరి ఓవర్లో రాధా యాదవ్ రెండు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించింది. జెమిమా రోడ్రిగ్స్ (57), లారా వోల్వార్డ్ (44), చిన్నెల్లి హెన్రీ (35*) మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓటమి పాలైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!