

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. షమీకి సెలక్టర్లు కనీసం ఒక్క అవకాశం అయినా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతడిలో ఇంకా టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉందని, అవకాశం కల్పించి ఉంటే మరో 40 వికెట్లు తీసేవాడని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు ముందు మాట్లాడిన రవిశాస్త్రి.. గత ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున షమీ నిలకడగా ఆడుతున్న విషయాన్ని గుర్తుచేశాడు. క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడుతూ 15-20 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇంతకంటే ఏం చేయాలని ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షమీకి సంబంధించిన ఆసక్తికర ఘటనను రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ వెనుకబడిన సమయంలో షమీ బౌలింగ్‌తో పరిస్థితిని మార్చగలడని జట్టు భావించిందని తెలిపాడు. లంచ్ బ్రేక్‌లో షమీ బిర్యానీ తినేందుకు సిద్ధమవగా, అతడిని రెచ్చగొట్టి మైదానంలోకి పంపాలని భరత్ ఠాకూర్‌ను పంపించినట్లు వివరించాడు. దీంతో కోపగించిన షమీ బిర్యానీ తినకుండా బయటకు వెళ్లిపోయాడని, ఆ తర్వాత మైదానంలోకి వచ్చి వరుసగా వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడని రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!