

తెలంగాణ ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో కళకళలాడాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మన సంతోషాలను ఇతరులతో పంచుకుంటూ, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచినప్పుడే పండుగకు నిజమైన అర్థం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం లోక్‌భవన్‌లో నిర్వహించిన ముందస్తు దీపావళి వేడుకల్లో గవర్నర్ తన సతీమణి జానకీ శుక్లాతో కలిసి పాల్గొన్నారు. అక్కడి సిబ్బందితో కలిసి బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా వేర్వేరు ప్రకటనల ద్వారా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!