

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న SVC 63 కోసం సల్మాన్ ఖాన్ సుమారు రూ.70 కోట్ల పారితోషికాన్ని అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే సల్మాన్ ఈసారి తక్కువ పారితోషికానికి ఒప్పుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సినిమా బడ్జెట్ కంటే వ్యక్తిగత అనుబంధమే ప్రధాన కారణమని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నిర్మాత రఫీ కాజీతో సల్మాన్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా లాభాల్లో వాటా తీసుకోవడం లేదా సన్నిహితుల కోసం పారితోషికం లేకుండా నటించడం వంటి నిర్ణయాలు తీసుకున్న సల్మాన్‌కు ఇది కొత్త విషయం కాదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఈద్ సందర్భంగా విడుదల కానుండగా, ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!