
జనరల్

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకాలు సాధించగా, ఇప్పుడు మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి బంగారు పతకం గెలుచుకుంది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్ను ఓడించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా ఫైనల్‌లో కెనడాకు చెందిన మేరీ అల్ అహ్మదీహ్పై 4-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. మరోవైపు జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ, దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టర్పై గెలిచి కాంస్య పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!