

ఫ్యాటీ లివర్ ఇప్పుడు మద్యం సేవించే వారికే పరిమితం కాదు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో పాటు, మద్యం తాగని వారిలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) వేగంగా పెరుగుతోంది. ఊబకాయం, మధుమేహం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా మారాయి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని "సైలెంట్ డిసీజ్"గా పరిగణిస్తారు. అయితే కాలేయం పనితీరు దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు కళ్ల చుట్టూ వాపు, చర్మం కాంతి కోల్పోవడం, మెడ లేదా ముఖంపై నల్లటి మచ్చలు, చర్మ దురద, తీవ్రమైన దశలో కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాలతో పాటు నిరంతర అలసట, పొత్తికడుపు కుడివైపు నొప్పి లేదా బరువుగా అనిపించడం, ఆకలి మందగించడం, వికారం, కారణం లేకుండా బరువు పెరగడం, ముదురు రంగు మూత్రం, పాలిపోయిన మలం లేదా లివర్ ఫంక్షన్ టెస్ట్‌లలో తేడాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, చక్కెర, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం, వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చు.
గమనిక
ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!