
క్రీడలు

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నాని రగ్గడ్ లుక్‌లో కనిపించనుండగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, ఆగస్టు 6న విడుదలయ్యే ‘ది ప్యారడైజ్’ టీజర్ “తగలబడుతుంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!