
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ కు పారిస్‌లోని ఫ్రెంచ్ ఓపెన్ లో ఘనమైన వీడ్కోలు నివాళి అర్పించారు. ఆయన 14 టైటిళ్ల అద్భుత విజయాన్ని గౌరవిస్తూ కోర్ట్ ఫిలిప్-చాట్రియర్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పాద ముద్ర, ట్రోఫీ, ‘14’ సంఖ్యతో కూడిన శాశ్వత స్మారక చిహ్నాన్ని కోర్ట్ పక్కన ఏర్పాటు చేశారు. ఈ సర్‌ప్రైజ్ కార్యక్రమంలో రోజర్ ఫెడరర్, నోవాక్ జోకోవిచ్, ఆండీ ముర్రే కూడా పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!