

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 196 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఎస్ఆర్హెచ్ యజమాని కావ్యా మారన్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా జరిగిన ఫ్యాక్ట్ చెక్‌లో అవి అసత్యమని తేలింది. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్, కోచ్ ముత్తయ్య మురళీధరన్‌తో కావ్యా మారన్ మాట్లాడుతున్న అసలు ఫొటోలను కొందరు డిజిటల్‌గా ఎడిట్ చేసి తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారు. మరికొందరు AI సాంకేతికతతో వీడియోలను రూపొందించి, కావ్యా మారన్ ఏడుస్తుండగా ఇషాన్ కిషన్, మురళీధరన్ ఓదారుస్తున్నట్లు చూపించారు. గతంలో కూడా సంగీత ఫొగట్, వినేశ్ ఫొగట్లకు సంబంధించిన ఇలాంటి ఫేక్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!