

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ దసున్ శనక 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెల్లలాగే (10), మెండీస్ (13), తీక్షణ (10) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 62 పరుగులతో అర్ధ సెంచరీ సాధించి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. విల్ జాక్స్ (21), హ్యారీ బ్రూక్ (14) స్వల్ప సహకారం అందించగా, శ్రీలంక బౌలర్లలో వెల్లలాగే మూడు వికెట్లు తీసాడు. మదుశంక, తీక్షణ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బౌలింగ్‌లో విల్ జాక్స్ మూడు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు సాధించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!