

‘ఇరుముడి’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలనటి బేబీ నక్షత్రకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె నటనకు ఏకంగా రెండు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు, ఒక ఉత్తమ నటుడు (స్పెషల్ మెన్షన్) అవార్డు అందుకున్న హీరో ధనుష్ కూడా ఫిదా అయ్యారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు శివ నిర్వాణకు వీడియో కాల్ చేసిన ధనుష్.. నక్షత్రతో మాట్లాడి ఆమె నటనను ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో పాత్రను పోషించిందంటూ ప్రశంసించారు.
ఆ తర్వాత సరదాగా.. ‘‘మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు కూడా నటన నేర్పిస్తావా?’’ అని ధనుష్ అడగడంతో నక్షత్ర ఆశ్చర్యపోయి క్యూట్‌గా ‘యెస్’ అని సమాధానమిచ్చింది. త్వరలో కలుద్దామని ధనుష్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘ఇరుముడి’లో మణికంఠ పాత్రలో నక్షత్ర నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. మరోవైపు ‘టాక్సిక్’ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ‘ఇరుముడి’ జోరు తగ్గుతుందని భావించినప్పటికీ, ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో రవితేజ నటించిన ‘ఇరుముడి’ హవా మరికొన్ని వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!