

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడిగా గుర్తింపు పొందిన ఉసేన్ బోల్ట్‌కు 40 ఏళ్ల వయసులో జీవితంలో మరో కీలక మైలురాయి చేరింది. దాదాపు 13 ఏళ్లుగా తన భాగస్వామి కాసి బెన్నెట్‌తో కలిసి ఉన్న బోల్ట్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన తన 40వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బోల్ట్ తన ప్రియురాలికి వివాహ ప్రతిపాదన చేశారని సమాచారం. ఐదు క్యారెట్ల వజ్రపు ఉంగరంతో మోకాళ్లపై కూర్చొని కాసి బెన్నెట్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
ట్రాక్‌పై తన వేగంతో ప్రపంచ రికార్డులు సృష్టించిన బోల్ట్, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో సమయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల ప్రేమ ప్రయాణం, ముగ్గురు పిల్లలతో కుటుంబ జీవితాన్ని కొనసాగించిన ఈ జంట ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బోల్ట్ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!