
జనరల్

లియాండర్ పేస్ ను ఆసియా టెన్నిస్ సమాఖ్య ప్లేయర్స్ అంబాసిడర్‌గా నియమించారు. వింబుల్డన్ టోర్నీ సందర్భంగా ఏటీఎఫ్ అధ్యక్షుడు యూరీ పోల్స్‌కీ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత టెన్నిస్ దిగ్గజమైన పేస్‌కు ఇది మరో ప్రతిష్టాత్మక బాధ్యతగా నిలిచింది.
ప్లేయర్స్ అంబాసిడర్‌గా లియాండర్ పేస్ ఆసియాలో టెన్నిస్ అభివృద్ధి, యువ క్రీడాకారులకు మార్గదర్శనం, ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించే కార్యక్రమాలకు సహకరించనున్నారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై ఏటీఎఫ్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఆసియా టెన్నిస్ ప్రాచుర్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేయనున్నారు. ఆయన అనుభవం యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఏటీఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!