
క్రీడలు

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన 55వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలిచి అభిమానులను అలరించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 19 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (56), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (59*) అద్భుత అర్ధశతకాలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ కీలక ఇన్నింగ్స్‌లతో ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. ఈ ఛేజ్ ధర్మశాల మైదానంలో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్‌గా రికార్డు సృష్టించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!